Subscribe to E-News

Latest TANTEX Events

F2 Movie 2019
Sun, Feb 24th 2019, @12:30pm
Tax 2019
Sat, Mar 2nd 2019, @2:30pm
Ugadi 2019
Sat, Apr 13th 2019, @5:02pm

Supported Events

UICOC - Annual Womens Conference
Fri, Feb 22nd 2019, @10:00am

Latest Events in Town

No Events

Slide Show of Events

Silver Sponsors

Banner
Banner
Banner
Banner
Banner

Our Media Partners

President's Message

ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు సంగీత, సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తూ, అన్ని జాతీయ సంస్థలకు
ధీటుగా, గత 33 సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ ముఖ్యోద్దేశ్యంగా, సేవలందిస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘంలో
దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక సభ్యుడిగా ప్రవేశించి, వివిధ శాఖలలో సేవలందించి అంచలంచలుగా ఎదుగుతూ నేడు
నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
 
 
ఈ సంవత్సరం సంస్థలో ప్రవేశించిన నూతన కార్యవర్గ సభ్యులందరికీ  సాదర స్వాగతం పలుకుతూ,  వీరందరి సంపూర్ణ సహకారంతో మన తెలుగు వారి
సేవలో నిమగ్నం కావడం  ఆనందంగా ఉంది.  సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న మన సభ్యుల అవసరాలకు  అనుగుణంగా సంస్థ
కార్యకలాపాలను రూపొందించడం ఎంతైనా అవసరం. 
2019 లో మీ అందరి సహాయ సహకారాలతో ఈ క్రింది కార్యకలాపాలతో మన టాంటెక్స్ తెలుగు పల్లకిని మోసుకెళ్ళడానికి  దశాంశ ప్రణాళికతో రంగం  సిద్ధం చేస్తున్నాను .
  •   సంస్థ పరిధిలో ఉన్న తెలుగు వారి మధ్య సఖ్యత పెంచడం.
  •   కార్యక్రమాల నాణ్యత పెంచడం, తద్వారా సభ్యుల ఆసక్తి  మరియు వారి భాగస్వామ్యం  పెంచడం      
  • సంస్థ  కార్యక్రమాలలో గణనీయంగా పెరుగుతున్న స్థానిక కళాకారులకు మరియు యువతకు  వేదిక కల్పించడం
  •   SocialMedia ను ప్రభావవంతంగా ఉపయోగిస్తూ సంస్థ కార్యక్రమాల సమాచారాన్ని ఎక్కువ మందికి చేరేలా చేయడం 
  • .       యువత వ్యక్తిత్వ వికాస పురోభివృద్ధికి మరియు  కాలేజ్ ప్రవేశానికి దోహదపడే కార్యక్రమాలను అందించడం  
  • .       పెద్దల జీవన సరళికి, ఆరోగ్య వృద్ధికి   అవసరమైన  ఆరోగ్య అవగాహన సదస్సులను   నిర్వహించడం
  •         క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తూ పురుషులు, స్త్రీలు  మరియు యువతను ప్రోత్సహించడం    
  • .       నూతనంగా స్థిరపడుతున్న అసంఖ్యాక తెలుగు కుటుంబాల  సభ్యత్వంతో సంస్థ సంఖ్యాబలం హెచ్చించడం
  •         పూర్వ అధ్యక్షులు, కార్యనిర్వాహక సిబ్బందిని, బోర్డు సభ్యులను సంస్థ కార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొనేలా చేయడం  
  •         నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోగలిగేలా యువత కి ముఖ్య కార్యక్రమాలలో బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించడం     
రండి… చేయీ చేయీ కలపండి…..  తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం,సంప్రదాయాల కలబోత  “తెలుగు సుగంధం” భావితరాలకు అందుబాటులో ఉండేట్టు చూడవలసిన బాధ్యత మనందరి పైనా  ఉంది.
సేవలందించడం ద్వారా వివిధ అంశాలలో నైపుణ్యాన్ని, ప్రజ్ఞాబలాన్ని  నిత్యం  పెంచుకుంటున్న సేవకులతో కలిసి పనిచేయడం ఒక
అదృష్టంగా  భావిస్తూ,  టాంటెక్స్ సంస్థ కార్యక్రమాలు జయప్రదం కావడానికి సభ్యులు కూడా భాగస్వామ్యులై, అవసరమైన ఆర్ధిక
సహాయం,  ప్రోత్సాహక సూచనలు , కార్యక్రమాల హాజరు తదితర అంశాలతో చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తున్నాను.   మన టాంటెక్స్ సంస్థకు
అండగా ఉంటున్న పోషక దాతలకు, సభ్యులకు, శ్రేయోభిలాషులకు, సహ కార్యవర్గ సభ్యులకు నా కృతఙ్ఞతాభివందనములు. 
 
మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పట్టే పెద్ద పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి సంబరాలను “టాంటెక్స్”జనవరి 26 2019 మధ్యా హ్నం 2 గంటలకు ఫ్రిస్కో హైస్కూల్ లో అంగరంగ వైభవంగా జరుపుకోబోతూంది. తెలుగు వారందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.
 
“సేవ చేసే ప్రతి అవకాశం సేవకుల సామర్థ్యాన్ని పెంచే ఒక ఉత్తమ అవకాశం” అని నమ్ముతూ, కార్యవర్గ సభ్యులందరి సహకారంతో, సభ్యుల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపుదిద్ది సంస్థ పేరును నిలబెడుతూ, మరింత ప్రగతి సాధించే దిశగా  నిరంతరం కృషి చేస్తానని మాట ఇస్తూ , మీ అందరి సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఆశిస్తూ...
 
సదా మీ సేవలో .....
 
నమస్సులతో ....మీ

వీర్నపు చినసత్యం