*** GanaSudha - Tune in details changed ***       SANKRANTHI 2012 issue of TELUGU VELUGU       SPOORTHI - Online Tutoring      

Donate

Support us...

Member Login






Lost Password?
Not member yet? Become TANTEX Member

Latest TANTEX Events

NNTV - Sahithya Vedika - February 2012
Sun, Feb 19th, @3:00pm

Latest events in town

No events

Slide Show of Events

Welcome


2012_president_02_size215_188.jpg
           ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సభ్యులకు మరియు తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

1999 వ సంవత్సరంలో స్వచ్ఛంద కార్యకర్తగా మన సంస్థకు పరిచయమై, ఒక దశాబ్ద కాలంగా సంస్థ కార్యకలాపాలలో భాగస్వామిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సంస్థతో అనుబంధం ఉన్నఈ కాలంలో సంస్థ ఉన్నతిని నిశితంగా గమనిస్తూ గర్వపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

టాంటెక్స్ సంస్థ కార్యక్రమాలను విస్తరిస్తూ, లక్ష్యాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, సభ్యులను సంఘటితపరుస్తూ, సుహృధ్బావ వాతావరణంలో పనిచేయటం ఎంత ముఖ్యమో తెలియచెప్పిన మార్గదర్శకులైన పూర్వాధ్యక్షులందరికీ వందనాలు.

1986 లో ప్రారంభమైన మన సంస్థ బీజాంకురం పుష్ప ఫల భరితమైన వృక్షంగా ఎదిగి గత సంవత్సరం రజతోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంది. దీనికి తోడ్పడిన వారందిరికి మరోసారి కృతజ్ఞతలు. దినదిన ప్రవర్థమానంగా క్రొత్త సభ్యత్వంతో విరాజిల్లుతూ, ప్రతి సంవత్సరం క్రొత్త క్రొత్త కార్యక్రమ రంగులను వెదజల్లుతూ మన టాంటెక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూనే ఉంది. క్రీడాస్ఫూర్తి గత సంవత్సర ఆకర్షణ అయితే, "గానసుధ"తో మన మనసులను పులకరింపజేస్తూ, నూతన విభిన్న అంశాలతో యువతకు "స్పూర్తి"నిచ్చి, స్నేహమేరా జీవితం అని "మైత్రి"ని పెంచుకొని, "వనితావేదిక"లతో స్త్రీలకు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, "సాహిత్యవేదిక" తో మన ఆలోచనలను ఉత్తేజితం చేసే మన సంస్థ సేవలు చిరస్మరణీయం.

పాతికేళ్ళ టాంటెక్స్ ప్రస్థానంలో మన సంస్థ చేసిన సేవ వెలకట్టలేనిది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఉత్తర అమెరికా జాతీయ తెలుగు సంస్థలకు ధీటుగా మన సంస్థ పేరు ప్రఖ్యాతులను పొందింది. మనం ఇప్పటివరకూ సాధించిన ఉన్నతిని సంరక్షించుకుంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రగతిని ఆకాంక్షిస్తూ స్వర్ణోత్సవాల వైపు మన అడుగులు వేసే సమయమాసన్నమైనది. ఈ దిశగా ప్రయాణిస్తూ ఇప్పుడున్న కార్యక్రమాలతో పాటు అదనంగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టి సభ్యులందరి సహాయ సహకారంతో నిర్వహించాలని ఆశిస్తున్నాము. సభ్యుల సూచన మేరకు "స్పందన" అనే కార్యక్రమం, తెలుగు భాషాబోధన, సంస్థ కార్యకలాపాల నిర్వహణకు ఒక సొంత భవనం సమకూర్చుకోవడం, నవతరం అవసరాలకు తగ్గట్టు మరింత కార్యక్రమ విస్తరణ లాంటివి ప్రస్తుత ఆలోచనలు.

Read more...
 
Listen Check Download
Enjoy listening to "GanaSudha Radio" every Saturday from 12:00 Noon to 2:00 PM on RadioKhushi.comNew!
Please bookmark this website and visit frequently to catch the latest news about up coming events.New!
Click below link to download Cultural Entry Form

PLATINUM Sponsors

Advertisement
Advertisement
Advertisement

GOLD Sponsors

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

SILVER Sponsors

Advertisement
Advertisement

OUR SPONSORS

Advertisement

OUR MEDIA PARTNERS

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Copyright © 2012 TANTEX All Rights Reserved