అందరికీ నమస్కారం 1986 లో ప్రారంభించబడి 40 వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఘన చరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్ తెలుగు
సంఘం (TANTEX) సంస్థకు 2026 వ
సంవత్సరానికి అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా
ఉంది. అయితే అదే సమయంలో నాపై
మోపబడిన గురు తర బాధ్యతను నెరవేర్చేవిషయంలో అంకిత భావంతో పని చేయడానికి నిశ్చయించుకొన్నానని తెలపడానికి
సంతోషిస్తున్నాను . ప్ర వాస భారతీయుల లో
తెలుగు వారి సంప్రదాయాలకు చిహ్నమైన
తెలుగు భాష, సాహిత్య, కళా రంగాలకు
రాజధానిగా డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరం విస్తరిస్తోంది .ఈ నగరం లో తెలుగు వారి
జనాభా రోజు రోజుకీ పెరుగుతున్నది
కూడా.నాకు కలిగిన ఈ మహత్తర అవకాశం సంప్రదాయ బద్ధమైన తెలుగు భాష ,సాహిత్య ,సంస్కృతులను ప్రతిబింబించే విధంగా , స్థానిక తెలుగు సమాజానికి సేవ చేసే గొప్ప సదవకాశంగా
భావిస్తున్నాను..
గత నాలుగు దశాబ్దాలుగా టాంటెక్స్
సంస్థ ను నడిపించిన సంస్థ అధ్యక్షులు,
కార్యనిర్వాహక సభ్యులు ,పాలకమండలి సభ్యులు , స్వయం సేవకులు అంకిత భావంతో నిర్వహించిన ,రేడియో షోలు,సాహిత్య సదస్సులు,సాంస్కృతిక కార్యక్రమాలు,యువజన క్రీడలు,ఆరోగ్య శిబిరాలు,,ఆహార వితరణ వంటి
సేవాకార్యక్రమాలు, ఈ పదవిని నేను చేపట్టే విధంగా నన్ను
ఆకర్షించాయనడంలో ఎట్టి సందేహం లేదు. వారు ప్రారంభించిన అన్ని కార్యక్రమాల నిర్వహణను మీ అందరి
సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని
భావిస్తున్నాను.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) నూతన కార్యవర్గ సభ్యులకు, పాలక మండలి సభ్యులకు ఇదే నా సాదర స్వాగతం. యువజన నైపుణ్యాభివృద్ధి ,నూతన సభ్యత్వ చేరికలపై దృష్టి,క్రొత్త దాతలను గుర్తించి వారితో టాంటెక్స్ కార్యక్రమాలను ప్రారంభింప చేయడం ద్వారా క్రొత్త సభ్యులను సంస్థలో భాగస్వాములను చేయడం , మీ అందరి సంపూర్ణ సహకారంతో మన కమ్యూనిటీ కి చేరువయ్యే మరింత వైవిధ్యమైన, ఆకర్షణీయమైన కార్యకలాపాలను రూపొందించుకొందాం.మీ అందరి అభిప్రాయాలను పరిగణన లోనికి తీసుకొని సంస్థ ఆశయాలను, కార్యక్రమాలను స్థానిక తెలుగు సమాజంలోకి తీసుకొని వెళ్ళాలని నా ఆకాంక్ష. 2026 వ సంవత్సరంలో ఈ లక్ష్యాలను సాధించడానికి మీ అందరి భాగస్వామ్యంతో, సమిష్టిగా ముందుకు సాగడానికి మీరంతా సహకరించవలసినదిగా కోరుతున్నాను.
తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి, సంప్రదాయాలను తరువాతి తరాలకు ఆదర్శమైన యువతరానికి అందేవిధంగా చూడడం వివిధరంగాల నిపుణులతో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యక్రమాలు విజయవంతం కావడానికి సలహాలు స్వీకరించడం, సంస్థ సభ్యులతో పాటు, తెలుగు వారందరూ భాగస్వామ్యులై, సంస్థ నిర్వహణకు అవసరమైన ఆర్ధిక సహకారం అందించేలా చూడడం ,కార్యక్రమాలను అందరి సహకారంతో అత్యుత్తమ స్థాయిలో అందించడం ఈ సంస్థకు అధ్యక్షత వహిస్తున్న నా భాధ్యత గా భావిస్తున్నాను.నా కుటుంబంతో పాటుమీరు మీకుటుంబ సభ్యులు ఆయు రారోగ్యఔశ్యర్యాలతో తులతూగుతూ నూతన సంవత్సరంలో టాంటెక్స్ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లవలసినదిగా కోరుతున్నాను.
మనందరి సంఘటిత కృషితో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ రాబోయే కాలములో తెలుగు యువతకూ వారి బంగారు భవిష్యత్తుకూ బాటలు వేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను .సంస్థకి అండగా ఉంటున్న పోషకదాతలకు, సభ్యులకు, శ్రేయోభిలాషులకు, కార్యవర్గ సభ్యులకు, పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతాభివందనాలు. మీ సహాయ సహకారాలు ఎప్పటిలాగే కొనసాగాలని కోరుతున్నాను.
Join us for upcoming cultural celebrations, community activities, and special programs designed to bring our Telugu community together.